పళ్లు రాలగొట్టిన Shah Rukh Khan.. గతాన్ని గుర్తుతెచ్చుకున్న బాలీవుడ్ బాద్షా..!
ABN, First Publish Date - 2021-12-20T00:54:25+05:30
2005వ సంవత్సరంలో ‘ద ఇన్నర్ అండ్ ఔటర్ వరల్డ్ ఆఫ్ షారుఖ్ ఖాన్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. బీబీసీ ఛానల్‌లో దాన్ని ప్రసారం చేశారు. రెండు భాగాలుగా డాక్యుమెంటరీ టెలికాస్ట్ కాగా... ఫస్ట్ పార్ట్‌లో కింగ్ ఖాన్ బాల్యం, విద్యాభ్యాసం వంటివి స్పృశించారు. ఆ క్రమంలో షారుఖ్ ఖాన్ తన చిన్న నాటి స్కూల్‌కి వెళ్లాడు!

ఢిల్లీలో పుట్టి, పెరిగిన ఎస్ఆర్కే స్థానిక ‘సెయింట్ కొలంబస్ స్కూల్’లో చదువుకున్నాడు. అక్కడికి మరోసారి తన డాక్యుమెంటరీ కోసం బాలీవుడ్ బాద్షాగా పయనమైన షారుఖ్... స్కూలు ఆవరణలో కాస్సేపు గడిపాడు. ఆయన అక్కడ ఉన్న సమయాన్ని తమ డాక్యుమెంటరీలో దర్శకనిర్మాతలు నిక్షిప్తం చేశారు. ఆ సందర్భంలోనే షారుఖ్ చిన్ననాటి సహచరుడు ఒకరు ‘‘అప్పట్లో నువ్వు ‘మాడర్న్ స్కూలు’ విద్యార్థుల చాలా మంది పళ్లు విరగొట్టావు గుర్తుందా?’’ అని ప్రశ్నించారు. దానికి షారుఖ్ ఖాన్ మాటలతో స్పందించలేదుగానీ... నవ్వుతూ అవునన్నట్టు త1ల ఊపాడు!
‘ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ షారుఖ్ ఖాన్’ డాక్యుమెంటరీలో బాద్షా తన చిన్న నాటి స్కూలు తాలూకూ ముచ్చట్లు మరిన్ని చెప్పాడు. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే... చదువుల్లో టాపరే అయినప్పటికీ షారుఖ్ అల్లరిలోనూ ముందుండేవాడట. దాంతో అప్పుడప్పుడూ తనకు తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందని నమ్మించి... క్లాసులో స్పృహ తప్పి పడిపోయేవాడట. ఫ్యూచర్లో బాలీవుడ్ సూపర్ స్టార్ కానున్న షారుఖ్ నటనని అతని చిన్ననాడు టీచర్లంతా నిజమేనని నమ్మేవారట. ఎస్ఆర్కే స్పృహ తప్పినట్టు యాక్టింగ్ చేసిన ప్రతీసారి పెద్ద హడావిడి జరిగేదని ఆయనే స్వయంగా డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చాడు!