అటువంటి పండగలను చేసుకోవడం ఇష్టం లేదంటున్న సోనమ్ కపూర్ సోదరి

ABN , First Publish Date - 2021-10-18T23:03:29+05:30 IST

తనకు పండగల పట్ల అంతగా నమ్మకం లేదని అనిల్ కపూర్ కూతురు, సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్ చెబుతోంది. అటువంటి వాటిని సెలెబ్రెట్ చేయడం తనకు, తన భర్తకు ఇద్దరికీ ఇష్టం లేదని

అటువంటి పండగలను చేసుకోవడం ఇష్టం లేదంటున్న సోనమ్ కపూర్ సోదరి

తనకు పండగల పట్ల అంతగా నమ్మకం లేదని అనిల్ కపూర్ కూతురు, సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్ చెబుతోంది. అటువంటి వాటిని సెలెబ్రెట్ చేయడం తనకు, తన భర్తకు ఇద్దరికీ ఇష్టం లేదని తెలుపుతోంది. సోషల్ మీడియాలో తన మీద వస్తోన్న ట్రోల్స్‌కు ధీటుగా జవాబిస్తోంది.


రియా కపూర్ తన స్నేహితుడైన కరణ్ బులానీ‌ని ఈ ఏడాది ఆగస్టు 14న వివాహం చేసుకుంది.  కర్వాచౌత్ ’’వంటి పండగల పట్ల తనకు నమ్మకం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. కర్వాచౌత్ పేరు చెప్పి తను ఎటుంటి బ్రాండ్‌లకు ప్రమోషన్ చేయబోనని పేర్కొంది. తనకు, తన భర్తకు ఇటువంటి వేడుకలను చేసుకోవడం ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఒక పోస్ట్‌ను పెడుతూ.. ‘‘  కర్వాచౌత్ పేరు చెప్పి ఎవరూ కూడా మాకు బహుమతులు ఇవ్వొదు. ఎటువంటి బ్రాండ్‌లు కూడా మమ్మల్ని సంప్రదిచొద్దు. నేను, నా భర్త ఇద్దరం ఇటువంటి వాటిని నమ్మం. కానీ, ఇతరులు చేసుకునే ఉత్సవాలను మేం గౌరవిస్తాం. ప్రస్తుతానికైతే మేం ఒకరికి, మరొకరం తోడు, నీడగా ఉంటున్నాం. ఈ విధంగా నేను ఎందుకు రాస్తున్నంటే కొంత మంది కొత్త వ్యక్తులు మమ్మల్ని ఈ వేడుక చేసుకోవాలని బలవంత పెడుతున్నారు ’’ అని రియా కపూర్ రాసింది.


రియా కపూర్ అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అయిషా, వీరే ది వెడ్డింగ్, ఖుబ్ సూరత్ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసింది. కర్వాచౌత్ అనేది కొత్తగా పెళ్లయిన వారు తమ భర్త క్షేమం కోరుతూ చేసుకునే పండగ. ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 24న కర్వాచౌత్ వస్తుంది. పౌర్ణమి నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. Updated Date - 2021-10-18T23:03:29+05:30 IST