వారి విషయం ఎంతో సంతోషాన్నిచ్చింది..: Sonakshi Sinha
ABN , First Publish Date - 2021-12-09T21:25:11+05:30 IST
బాలీవుడ్లో పాపులారిటీ ఉన్న నటీమణుల్లో సోనాక్షి సిన్హా ఒకరు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘దబాంగ్’ సిరీస్ మూవీస్‌తో బాగా పాపులారిటీ సాధించింది ఈ బ్యూటీ.
బాలీవుడ్లో పాపులారిటీ ఉన్న నటీమణుల్లో సోనాక్షి సిన్హా ఒకరు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘దబాంగ్’ సిరీస్ మూవీస్‌తో బాగా పాపులారిటీ సాధించింది ఈ బ్యూటీ. ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం బాలీవుడ్లో ట్రెండింగ్‌లో ఉన్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించి మాట్లాడింది.
రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ హోటల్లో డిసెంబర్ 9న విక్యాట్ రాయల్ వెడ్డింగ్ జరుగుతోంది. కబీర్ ఖాన్, మిని మాథుర్, కియారా అడ్వాణీ వంటి ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు కానున్నారు.
ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కత్రినా, విక్కీ పెళ్లి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. వారిద్దరూ సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నా. ఆ కపుల్‌ని పర్సనల్‌గా కలిసి శుభాకాంక్షలు చెబుతాన’ని సోనాక్షి తెలిపింది. కాగా, ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ రితేష్ దేశ్‌ముఖ్, సాఖిబ్ సలీంతో కలిసి ‘కాకుండా’ అనే హార్రర్ మూవీలో నటిస్తోంది.