సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shilpa Shetty భర్త రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2021-12-16T00:19:22+05:30

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. పోలీసులు 4వారాల పాటు అతడిని అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. పోలీసులు 4వారాల పాటు అతడిని అరెస్టు చేయకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. 


రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఆ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 25న కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మరో 5గురి బెయిల్ పిటిషన్‌లను కూడా హైకోర్టు తిరస్కరించింది. ఫలితంగా అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన కోర్టు 4వారాల పాటు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు జారీ చేసింది.     


పోర్న్ కంటెంట్‌ను చిత్రీకరించి, స్ట్రీమింగ్ చేశాడని పోలీసులు రాజ్‌కుంద్రాపై కేసును నమోదు చేశారు. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు జులైలో అతడిని అరెస్టు చేశారు. హాట్‌షాట్స్ అనే యాప్‌లో ఈ కంటెంట్‌ను  స్ట్రీమ్ చేశాడని పోలీసులు తెలుపుతున్నారు. కానీ, పోలీసులు తెలుపుతున్నట్టు  ఆ యాప్‌తో తనకు సంబంధం లేదని రాజ్ కుంద్రా సుప్రీంకోర్టు‌లో పిటిషన్ వేశాడు. తనను బలిపశువును చేశారని అతడు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను విచారణ జరిపి 4వారాల పాటు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు జారీ చేసింది.  

Updated Date - 2021-12-16T00:19:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!