Shalini Talwar: హనీమూన్ ట్రిప్‌లో వేధించాడు
ABN , First Publish Date - 2021-08-05T23:57:57+05:30 IST
బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య శాలినీ తల్వార్ సింగ్ గృహహింస, మానసిక హింస ఆర్థిక మోసం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే! గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి రూ.10 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని పిటిషన్లో ఆమె డిమాండ్ చేసింది.

మా పెళ్లి విషయం సీక్రెట్‌గా ఉంచాడు
పరాయి స్ర్తీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు
నిలదీస్తే కొట్టేవాడు...
మావయ్య అసభ్యంగా తాకారు..
భర్త హనీసింగ్‌పై శాలినీ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య శాలినీ తల్వార్ సింగ్ గృహహింస, మానసిక హింస ఆర్థిక మోసం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే! గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి రూ.10 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని పిటిషన్లో ఆమె డిమాండ్ చేసింది. ఈ మేరకు కోర్టు హనీ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28లోపు దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. హనీసింగ్ భార్య పేరు మీదున్న ఉమ్మడి ఆస్తి జోలికి వెళ్లకూడదని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. షాలినీ తల్వార్ కోర్టుకు సమర్పించిన 120 పేజీల లేఖలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘‘2011లో మా పెళ్లి అయింది. హనీమూన్ అయిపోయిన తర్వాత హర్దేశ్ సింగ్‌లో ఉన్నట్టుండి మార్పు వచ్చింది. ఇందుకిలా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రశ్నిస్తే ఇష్టం లేకపోయినా కేవలం నాకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. హనీమూన్ ట్రిప్‌లో నన్ను ఒంటరిగా వదిలేసి తాగుతూ తిరిగేవాడు. గట్టిగా నిలదీస్తే జుట్టు పట్టుకుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. అందుకే నన్ను తనవెంట టూర్లకు తీసుకెళ్లేవాడు కాదు. మా పెళ్లి విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచాడు. నా వేలికి ఉంగరం కూడా పెట్టనిచ్చేవాడు కాదు. సోషల్ మీడియాలో మా పెళ్లి ఫొటో లీక్ అవ్వడానికి నేనే కారణమని హింసించాడు. అవి సినిమా షూటింగ్ స్టిల్స్ అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఓ బెంగాలీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నా నోరు మెదపనిచ్చేవాడు కాదు’’ అని పేర్కొంది. ‘బ్రౌన్ ర్యాంగ్’ పాట కోసం వర్క్ చేసిన ఒక మహిళతోనూ హనీ సింగ్‌కు అఫైర్ ఉంది. ఆ ఫొటోలు నా కంట పడడంతో ఏం జరుగుతోందని నిలదీశాను. కోపంతో నాపై మందు బాటిళ్లు విసిరాడు. ఇలా పలుమార్లు నా భర్త క్రూరంగా ప్రవర్తించాడు. ఇదిలా వుంటే ఒకరోజు నేను బట్టలు మార్చుకుంటుంటే హనీ సింగ్ తండ్రి నేరుగా నా గదిలోకి వచ్చి నన్ను అసభ్యంగా తాకాడు. ఆ ఇంట్లో నన్ను హింసించారని నిరూపించేందుకు ఇలా చాలా సాక్ష్యాలున్నాయి’’ శాలిని తెలిపారు.