నష్టాన్ని పారితోషికం నుంచి మినహాయించుకోండని చెబుతున్న షాహిద్ కపూర్
ABN , First Publish Date - 2021-12-30T23:05:38+05:30 IST
షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో నటించిన చిత్రం ‘ జెర్సీ’. టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘ జెర్సీ’ కీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో నటించిన చిత్రం ‘ జెర్సీ’. టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘ జెర్సీ’ కీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ షూటింగ్ గతంలోనే పూర్తయింది. కానీ, చిత్రాన్ని థియేటర్లల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అందువల్ల గత కొంత కాలంగా వేచి చూస్తున్నారు. సినిమా హాళ్లు తెరచుకోవడంతోనే డిసెంబర్ 31న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం థియేటర్లను మూసివేసింది. దీంతో మరోసారి సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు మంచి ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. నిర్మాతలకు కూడా ఈ ఆఫర్ లాభదాయకంగానే ఉన్నట్టు సమాచారం. ‘‘ చిత్రం మాత్రం థియేటర్లల్లోనే విడుదల కావాలని షాహిద్ భావిస్తున్నారు. ఈ సినిమా కథపై మంచి నమ్మకంతో ఉన్నారు. అవసరమైతే పారితోషికాన్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ’’ అని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.
కబీర్ సింగ్ బాక్సాఫీస్ హిట్‌గా నిలవడంతో షాహిద్ కపూర్ రూ. 31కోట్ల భారీ పారితోషికాన్ని ఈ సినిమాకు ఛార్జ్ చేశారు. చిత్రం థియేటర్లల్లోనే విడుదల కావాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. అందువల్ల సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు అమ్మవద్దని కోరుతున్నట్టు సమాచారం. సినిమా హాళ్లు తెరచి వరకు వేచి ఉండాలని ఆయన కోరుతున్నారు. ఎంత నష్టం వాటిల్లితే అంత మొత్తాన్ని పారితోషికం నుంచి తగ్గించుకోమని నిర్మాతలకు చెప్పినట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రూ. 5కోట్ల నష్టం వాటిల్లితే అంత మొత్తాన్ని, రూ. 10కోట్ల నష్టం వాటిల్లితే అంత మొత్తాన్ని పారితోషికం నుంచి తీసుకోమని నిర్మాతలను కోరినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.