సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aryan Khan కు బెయిల్ ప్రకటన రాగానే షారూక్ ఇంట్లో సీన్ ఇదీ.. వైరల్ అవుతున్న బాద్ షా ఫోటో..

ABN, First Publish Date - 2021-10-29T17:31:10+05:30

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ మొహం మీద ఎట్టకేలకు చిరునవ్వు విరిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ మొహం మీద ఎట్టకేలకు చిరునవ్వు విరిసింది. ఈ నెల రెండో తేదీన డ్రగ్స్ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న ఆర్యన్ ఖాన్‌ను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు షారూక్ విశ్వప్రయత్నాలు చేశాడు. ప్రముఖ న్యాయవాదాలను నియమించుకున్నాడు. అయినప్పటికీ ఆ కేసును విచారించిన ముంబై స్పెషల్ కోర్టు ఆర్యన్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో షారూక్ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు.


బెయిల్ పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు న్యాయమూర్తి ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పునిచ్చారు. దీంతో షారూక్, ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. షారూక్ నివాసం మన్నత్ ముందు ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. షారూక్ చిన్న కొడుకు అబ్రహం మన్నత్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. అనంతరం లీగల్ టీమ్‌తో షారూక్ సంతోషం పంచుకున్నాడు. షారూక్‌తో కలిసి వారు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్యన్ అరెస్ట్ అయిన నాటి నుంచి షారూక్ ఇలాంటి ఫొటోలకు దూరంగా ఉన్నాడు. 

Updated Date - 2021-10-29T17:31:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!