నా బాయ్ ఫ్రెండ్ నన్ను చెత్త బుట్టలా ట్రీట్ చేశాడు..ఈ వయసులో డేటింగ్ చేస్తే డిజాస్టర్‌గా మిగిలిపోతుందంటున్న Sanjay Dutt కూతురు
ABN , First Publish Date - 2021-11-15T22:15:32+05:30 IST
వివిధ రకాల కేసుల్లో ఇరక్కున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించుకున్న నటుడు సంజయ్ దత్. కేజీఎఫ్ -2లో విలన్‌గా కనిపించి ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు.
వివిధ రకాల కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించుకున్న నటుడు సంజయ్ దత్. కేజీఎఫ్ -2లో విలన్‌గా కనిపించి ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు. సంజయ్ దత్‌కు త్రిషాలా దత్ అనే ఒక కూతురు ఉంది. ఆమె వయసు 33 సంవత్సరాలు.
ఆమె నవంబర్ 14న ట్విట్టర్లో అస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించింది. నెటిజన్లు అడిగిన అనేక రకాల ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. తను ఏ సమయంలోనైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. ఈ వయసులో డేటింగ్ చేస్తే డిజాస్టర్‌గా మిగిలిపోతుందని వెల్లడించింది. తనకు తగినవాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపింది.
ఒక నెటిజన్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగగా ఆమె సమాధానమిచ్చింది. ‘‘ ఈ వయసులో డేటింగ్ చేస్తే డిజాస్టర్‌గా మిగిలిపోతుంది. కొందరు ఎప్పుడైనా డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. నన్ను గౌరవించేవాడు మంచి మనిషి దొరికితే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను ’’ అని త్రిషాలా దత్ చెప్పింది. ‘‘ కొన్ని ఏళ్ల క్రితం నేను రిలేషన్ షిప్లో ఉన్నాను. నా బాయ్ ఫ్రెండ్ నన్ను చెత్త బుట్టలా ట్రీట్ చేశాడు ’’ అని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సంజయ్దత్లా ఆమె సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌ను వెతుక్కోకుండా మెడిసిన్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో సైకోథెరఫిస్ట్గా పని చేస్తుంది.