సమీరారెడ్డికి కొవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-18T17:10:11+05:30 IST
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంలో సినీ సెలబ్రిటీలు బాగానే కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా తెలియజేశారు.

కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంలో సినీ సెలబ్రిటీలు బాగానే కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా తెలియజేశారు. ఆమె కుటుంబంలో మిగిలిన వారందరికీ కరోనా నెగటివ్ రిపోర్ట్ అని తేలింది. ఇప్పుడు సమీరా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. సమీరా గత ఏడాది తన కుటుంబంతో సహా గోవాలోనే ఉంటోంది. పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు సమీరా దూరంగానే ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా పోస్టులు పెడుతుంటుంది. తెలుగులోనూ సమీరా రెడ్డి జైచిరంజీవ, నరసింహుడు, అశోక్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సమీరారెడ్డి.