సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aryan Khan డ్రగ్ర్స్ కేసు ఎఫెక్ట్.. మొదటి భార్యతో విడాకుల గురించి స్పందించిన Sameer Wankhede

ABN, First Publish Date - 2021-10-25T21:50:25+05:30

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సాగుతున్న పోరు రోజురోజుకు ముదురుతోంది. ఆర్యన్ ఖాన్ కేసులో సమీర్ వాంఖడే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మహారాష్ట్ర మంత్రి మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాంఖడే మతం గురించి విమర్శలు చేశారు. తప్పుడు సర్టిఫికెట్‌తో వాంఖడే ఉద్యోగం సంపాదించాడని విమర్శించారు. 


దీనిపై వాంఖడే తాజాగా స్పందించారు. `నా మతానికి సంబంధించి నవాబ్ మాలిక్ ఇటీవల చేసిన ట్వీట్ గురించితెలుసుకున్నాను. దానికి ప్రస్తుత డ్రగ్స్ కేసుకు సంబంధం ఏంటి? నా తండ్రి హిందువు, నా తల్లి ముస్లిం. నేను రెండు మతాలకూ చెందిన వాడిని. నా వారసత్వం పట్ల నేను చాలా గర్వపడుతున్నా. 2006లో నేను షబానా ఖురేషి అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నా. అనంతరం 2016లో ఇద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. 2017లో క్రాంతి రేడ్కర్‌ను వివాహం చేసుకున్నా. 


ఈ కేసుకు, నా వ్యక్తిగత విషయాలను ముడిపెడుతూ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం. చనిపోయిన నా తల్లిని, నా తండ్రిని, నా కుటుంబాన్ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు. గత కొద్ది రోజులుగా మంత్రిగారు చేస్తున్న విమర్శలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి. నా పరువు తీసేలా నా కుటుంబం గురించి, నా గురించి మంత్రి చేస్తున్న ఆరోపణలు ఎంతో బాధ కలిగిస్తున్నాయ`ని వాంఖడే ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-25T21:50:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!