సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NCB ‘సింగం’ : షారుఖ్ తనయుడ్ని అరెస్ట్ చేసిన సమీర్ వాంఖేడే అంటే సెలబ్రిటీలకు ఎందుకంత దడ?

ABN, First Publish Date - 2021-10-06T02:12:50+05:30

మనకు సినిమాల్లో నిజాయితీగల పోలీస్ ఆఫీసర్స్‌గా హీరోలు చాలా సార్లు కనిపిస్తుంటారు. కానీ, నిజ జీవితంలో అంత సిన్సియర్, స్ట్రిక్ట్ ఆఫీసర్స్ చాలా అరుదుగా మాత్రమే ఎదురవుతుంటారు. ఇక సమీర్ వాంఖేడే అనే ఐఆర్ఎస్ అధికారి అయితే మరింత ప్రత్యేకం! ఎందుకంటే, ఈయన సినిమా హీరోలకి కూడా సింహ స్వప్నం లాంటి రియల్ హీరో! ముఖ్యంగా, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈయన పేరు చెబితే హడలిపోతుంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనకు సినిమాల్లో నిజాయితీగల పోలీస్ ఆఫీసర్స్‌గా హీరోలు చాలా సార్లు కనిపిస్తుంటారు. కానీ, నిజ జీవితంలో అంత సిన్సియర్, స్ట్రిక్ట్ ఆఫీసర్స్ చాలా అరుదుగా మాత్రమే ఎదురవుతుంటారు. ఇక సమీర్ వాంఖేడే అనే ఐఆర్ఎస్ అధికారి అయితే మరింత ప్రత్యేకం! ఎందుకంటే, ఈయన సినిమా హీరోలకి కూడా సింహ స్వప్నం లాంటి రియల్ హీరో! ముఖ్యంగా, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈయన పేరు చెబితే హడలిపోతుంటారు...


నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ సమీర్ వాంఖేడే తాజాగా వార్తల్లో నిలిచారు. ఈ 40 ఏళ్ల అధికారి షారుఖ్ తనయుడ్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాడు. అయితే, ఆయన బాలీవుడ్‌కు కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు ‘స్టార్స్’కు ‘చుక్కలు’ చూపించాడు సమీర్! 


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ మాఫియా కోణం కూడా ప్రచారంలోకి రావటంతో సమీర్ వాంఖేడే దానిపై తీవ్రంగా దృష్టి పెట్టారు. రియా చక్రవర్తి చుట్టూ ముసురుకున్న కేసుల్ని ఆయన సీరియస్‌గా డీల్ చేశారు. ఎంతలా అంటే, డ్రగ్స్ మాఫియా ఆయన మీద దాడులు కూడా చేసేలా! 2020 నవంబర్‌లో ఆయన మీద, మరికొందరు ఎన్సీబీ అధికారుల మీద భౌతిక దాడి జరిగింది. సమీర్ గాయపడ్డారు


దాడులు జరిగినా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా వెనక్కి తగ్గని ‘సింగం’ సమీర్ వాంఖేడే అంటారు ముంబైలో. అందుకు స్పష్టమైన తార్కాణం ఆయన రెండేళ్లలో పట్టుకున్న డ్రగ్స్ విలువే! సమీర్ అండ్ హిజ్ టీమ్... మొత్తంగా 17 వేల కోట్ల రూపాయల అక్రమ మత్తు పదార్థాల్ని ఇప్పటి వరకూ సీజ్ చేశారు!  


సెలబ్రిటీలకు కూడా సమీర్ సెగ బాగా తగులుతూ ఉంటుంది. ఆయన కస్టమ్స్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు 2 వేల మంది ప్రముఖుల మీద కేసులు పెట్టారంటే ఆయన ఊపు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు! ఆయా సెలబ్రిటీలందరూ తగినంత డబ్బు చెల్లించాకే విదేశాల నుంచీ తెచ్చిన తమ విలువైన వస్తువులు ఇళ్లకు తీసుకెళ్లారట. సమీర్ వాంఖేడే హిట్ లిస్ట్‌లో చాలా మంది బాంబే బాబులు ఉన్నప్పటికీ... మీకా సింగ్, అనురాగ్ కశ్యప్, వివేక్ ఒబెరాయ్... ఇలా కొంత మంది పేర్లు చెప్పుకోవచ్చు. మన రామ్ గోపాల్ వర్మ ఆస్తులపై కూడా ఆ మధ్య ఈయన దాడులు చేసి కేసులు పెట్టించారట!


సినిమా వాళ్లతో నిత్యం వైరం కొనసాగించే సమీర్ 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య క్రాంతి రెడ్కర్... మరాఠీ, హిందీ సినిమాల్లో నటించిన పాప్యులర్ నటి కావటం... కొసమెరుపు!


Updated Date - 2021-10-06T02:12:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!