Samanthaను బాలీవుడ్‌కు తీసుకు వెళుతున్న Taapsee?

ABN , First Publish Date - 2021-11-01T21:50:35+05:30 IST

అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది.

Samanthaను బాలీవుడ్‌కు తీసుకు వెళుతున్న Taapsee?

అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. వరుసబెట్టి సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో `శాకుంతలం`, తమిళంలో `కాతువాక్కుల రెండు కాదల్` సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది. అలాగే తెలుగులో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, `ఫ్యామిలీమేన్-2`తో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సమంత బాలీవుడ్ ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసిందట. 


తెలుగు నుంచి బాలీవుడ్‌కు వెళ్లి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తాప్సీ ఈ విషయంలో సమంతకు సహాయం చేస్తోందట. తాప్సీ తన స్వంత నిర్మాణ సంస్థపై మహిళా ప్రాధాన్యమున్న సినిమాను నిర్మించాలని భావిస్తోందట. ఆ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోబోతోందట. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది, హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం రాబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-11-01T21:50:35+05:30 IST