క్యాన్సర్‌తో Salman Khan నిర్మాత మృతి

ABN , First Publish Date - 2021-12-30T18:37:45+05:30 IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘వీర్’ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నిర్మాత విజయ్ గలానీ డిసెంబర్ 29 (బుధవారం)న బ్లడ్ క్యాన్సర్‌తో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో మరణించారు...

క్యాన్సర్‌తో Salman Khan నిర్మాత మృతి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘వీర్’ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నిర్మాత విజయ్ గలానీ డిసెంబర్ 29 (బుధవారం)న బ్లడ్ క్యాన్సర్‌తో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో మరణించారు. నివేదికల ప్రకారం, మజ్జ ఎముక మార్పిడి కోసం కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు. అయితే అక్కడి వెళ్లే కొన్ని నెలల ముందు మాత్రమే ఆయనకి ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. కాగా 50 ఏళ్ల వయస్సులో ఆయన మరణం ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సన్నిహితులను విషాదంలో ముంచింది.


అయితే, విజయవంతమైన నిర్మాతగా నిలిచిన విజయ్ గలానీకి ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్‌గా 1992లో ‘సూర్యవంశీ’, 1998లో ‘అచానక్’, 2001లో అక్షయ్ కుమార్‌తో ‘అజ్నాబీ’ తీశారు. 2010లో సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘వీర్’తో మంచి గుర్తింపు పొందారు. కాగా, ఆయన చివరి చిత్రమైన విద్యుత్ జమ్వాల్, శృతి హాసన్ ‘ది పవర్’ త్వరలో విడుదల కానుంది.

Updated Date - 2021-12-30T18:37:45+05:30 IST