సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman Khan కొత్త ఫ్లాట్ అద్దె ఎంతో తెలిస్తే..!

ABN, First Publish Date - 2021-10-18T17:55:51+05:30

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరోనా సమయంలో ఫామ్ హౌస్‌లో సేద తీరిన సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలను సెట్స్ పైకి ఎక్కిస్తున్నాడు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని అత్యంత విలాసవింతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో సల్మాన్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ తాజాగా తన నివాసానికి సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఓ డూప్లెక్స్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడట. 


ఈ ఫ్లాట్ అద్దె నెలకు 8.25 లక్షల రూపాయలట. ఇది సల్మాన్ నివసించడానికి కాదు.. అతడి నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాల కథా చర్చలు ఆ ఫ్లాట్‌లో జరుగుతాయట. కేవలం స్టోరీ సిట్టింగ్స్ కోసమే సల్మాన్ భారీ వ్యయంతో ఓ డూప్లెక్స్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన `అంతిమ్` సినిమా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సల్మాన్ చేతిలో ప్రస్తుతం `టైగర్ 3`, `కభీ ఈద్ కభీ దివాళి`, `కిక్ 2` సినిమాలున్నాయి. 

Updated Date - 2021-10-18T17:55:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!