సల్మాన్ ఖాన్ బర్త్‌డేకు అందిన ఖరీదైన గిఫ్ట్‌లివే..

ABN , First Publish Date - 2021-12-30T02:31:09+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. బాలీవుడ్ భాయిజాన్ 56వ పుట్టిన రోజు

సల్మాన్ ఖాన్ బర్త్‌డేకు అందిన ఖరీదైన గిఫ్ట్‌లివే..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. బాలీవుడ్ భాయిజాన్ 56వ పుట్టిన రోజు వేడుకలను పన్వేల్‌లోని ఫామ్ హౌస్‌లో ఈ మధ్యనే జరుపుకొన్నారు. సల్లూ భాయ్‌కు బర్త్ డే గిఫ్ట్‌లుగా ఖరీదైన బహూమతులు అందినట్టు తెలుస్తోంది. కత్రినా కైఫ్ నుంచి శిల్పా శెట్టి వరకు అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ బహూమతులను అందించిన వారిలో ఉన్నారు.  అయితే, ఈ బాహూమతులన్నింటిపై ఓ లుక్కేద్దామా..


ఆంగ్ల పత్రికల్లో వెలువడుతున్న కథనాల ప్రకారం.. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లగ్జరీ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా అందించింది. ఈ వాచ్ ఖరీదు దాదాపుగా రూ.10లక్షల నుంచి రూ. 12లక్షల విలువ‌ జేస్తుందని సమాచారం. భాయిజాన్ సోదరుడు సోహైల్ ఖాన్ రూ. 25లక్షల విలువ జేసే బీఎమ్‌డబ్ల్యూ-ఎస్ 1000 ఆర్‌ఆర్‌ఆర్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. మరో సోదరుడైన అర్భాజ్ ఖాన్ దాదాపుగా రూ. 3 కోట్ల విలువజేసే ఆడి క్యూ-8 కారును బాహూమతిగా ఇచ్చారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అనిల్ కపూర్ ఒక లెదర్ జాకెట్‌ను బాహూమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఈ జాకెట్ ధర రూ.27లక్షలని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సల్లూ భాయ్‌కు కత్రినా కైఫ్ రూ. 3లక్షల విలువ జేసే గోల్డ్ బ్రాస్ లేట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. శిల్పా శెట్టి రూ. 17లక్షల విలువ జేసే ఒక డైమండ్ బ్రాస్‌లేట్‌ను బాహూమతిగా అందించింది. సల్మాన్ ఖాన్ తండ్రైన సలీమ్ ఖాన్ బర్త్ డే బాయ్‌కి జుహులో ఒక అపార్ట్‌మెంట్‌ను కొనిచ్చినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ అపార్ట్ మెంట్ విలువ దాదాపుగా రూ. 12కోట్ల నుంచి రూ. 13కోట్ల వరకు ఉంటుందని సమాచారం.    

Updated Date - 2021-12-30T02:31:09+05:30 IST