రవితేజ సినిమా రీమేక్‌లో సల్మాన్...!
ABN , First Publish Date - 2021-06-13T22:28:58+05:30 IST
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దక్షిణాది సినిమాలపై మోజు పడ్డారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకెళ్తే..రీసెంట్‌గా ‘రాధే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్‌ఖాన్ రెండు దక్షిణాది సినిమాల...

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దక్షిణాది సినిమాలపై మోజు పడ్డారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకెళ్తే..రీసెంట్‌గా ‘రాధే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్‌ఖాన్ రెండు దక్షిణాది సినిమాల రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి విజయ్ హీరోగా నటించిన తమిల చిత్రం ‘మాస్టర్’. కాగా.. మరో సినిమా మాస్ మహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘ఖిలాడి’. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. ‘ఖిలాడి’ విడుదల కాకముందే సల్మాన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హిందీ రీమేక్‌ను కూడా రమేశ్ వర్మనే డైరెక్ట్ చేస్తాడని కూడా అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది వరకు రవితేజ హీరోగా చేసిన ‘కిక్’ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.