ప్రేయసితో కలిసి దీపావళి పార్టీకి హాజరైన Salman Khan!
ABN , First Publish Date - 2021-11-05T21:07:56+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు గ్రాండ్‌గా దీపావళి పార్టీ ఇస్తుంటాడు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు గ్రాండ్‌గా దీపావళి పార్టీ ఇస్తుంటాడు. కరోనా కారణంగా గతేడాది అలాంటి సంబరాలేవీ లేకుండా పోయాయి. ఈ సారి బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం, స్నేహితులు, బంధువుల కోసం సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ పార్టీ ఏర్పాటు చేశాడు. తన గాళ్‌ఫ్రెండ్ లూలియా వంటూర్తో కలిసి సల్మాన్ ఈ పార్టీలో సందడి చేశాడు.
వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులివ్వలేదు. అయితే వేడుకలో ఇద్దరూ కలిసి నిర్మాత డేవిడ్ ధవన్‌తో చాలా సేపు చర్చలు జరిపారు. ఇక, మలైకా అరోరా నుంచి విడిపోయిన సల్మాన్ సోదరుడు అర్భాజ్ తన గాళ్‌ఫ్రెండ్ జార్జియా ఆండ్రియానితో ఈ పార్టీకి హాజరయ్యాడు. అలాగే నేహా ధూపియా, అంగద్ బేడీ, నిఖిల్ ద్వివేది, డేవిడ్ ధవన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు.