Viral: అభిమానుల మనసులు దోచుకుంటున్న సల్మాన్ ఖాన్, జెనీలియా డ్యాన్స్ వీడియో
ABN , First Publish Date - 2021-12-28T18:57:55+05:30 IST
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న 56వ పుట్టిన రోజుని పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో జరుపుకున్నాడు...

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న 56వ పుట్టిన రోజుని పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో జరుపుకున్నాడు. బాలీవుడ్‌లోని సన్నిహితుల మధ్య జరిగిన ఈ పార్టీకి సెలబ్రిటీ కపుల్ జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ కూడా హాజరయ్యారు.
ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఆ పార్టీలో సల్మాన్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది జెన్నీ. అందులో ఈ సెటబ్రిటీలు ఇద్దరూ మెరూన్ టీ షర్స్ట్తో పాటు డెనిమ్ జీన్స్ వేసుకుని ఉన్నారు. అంతేకాకుండా.. ‘ఎంతో మంచి మనసున్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకు సంతోషం, ప్రేమ, ఆరోగ్యం దొరకాలని కోరుకుంటున్నాను. ఈ రోజు భాయ్ పుట్టిన రోజు’ అంటూ రాసుకొచ్చింది.
ఎంతో సరదాగా, నవ్వుతూ వారిద్దరూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సల్మాన్ పార్టీకి బాబీ డియోల్, ఇబ్రహిం అలీఖాన్, అర్బాజ్ ఖాన్, సల్లు భాయ్ మాజీ ప్రియురాలు సంగీత బిజ్లానీ వంటి ఎంతోమంది హాజరయ్యారు. కాగా, మీరు కూడా ఈ వైరల్ వీడియోని మీరు ఒకసారి చూసేయండి..