తొలి సినిమా హిట్ అయినా Salman Khanకు అవకాశాలు రాలేదట.. దాంతో సలీం ఖాన్ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-10-18T20:17:54+05:30 IST

సల్మాన్ ఖాన్.. బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న హీరో.

తొలి సినిమా హిట్ అయినా Salman Khanకు అవకాశాలు రాలేదట.. దాంతో సలీం ఖాన్ ఏం చేశాడంటే..

సల్మాన్ ఖాన్.. బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న హీరో. అటు వెండితెర పైన, ఇటు బుల్లితెర పైనా రాణిస్తూ దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు. 1989లో `మైనే ప్యార్‌ కియా` వంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన సల్మాన్ కెరీర్ ప్రారంభ దశలో కాస్త ఇబ్బందులు పడ్డాడట. తొలి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయినా సల్మాన్ విమర్శలు ఎదుర్కొన్నాడట. నాలుగైదు నెలలు ఖాళీ గానే ఉన్నాడట. ఆ విషయాలను ఓ సందర్భంలో సల్మాన్ పంచుకున్నాడు. 


`నా తొలి చిత్రం `మైనే ప్యార్‌ కియా` ఘన విజయం సాధించింది. అప్పటికి బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయినా నన్నెవరూ పట్టించుకోలేదు. ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం భాగ్యశ్రీకి వెళ్లిపోవడమే కారణం. ఆ సినిమా హిట్‌ కావడానికి భాగ్యశ్రీనే కారణమని, నేను ఏదో ఉన్నాను అంటే ఉన్నానని సామాన్య ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు కూడా అనుకున్నారు. దీంతో నాలుగైదు నెలల వరకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతో మా నాన్న సలీం ఖాన్‌ నా బాధ చూడలేక నిర్మాత జీపీ సిప్పీని పిలిచి.. సల్మాన్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించమని అడిగారు. ఆ ప్రకటన పత్రికల్లో రావడంతో ఇతర దర్శకులు, నిర్మాతలు కూడా నా గురించి ఆలోచించారు. అప్పటి నుంచి ఆఫర్లు మొదలయ్యాయ`ని సల్మాన్ చెప్పాడు. 

Updated Date - 2021-10-18T20:17:54+05:30 IST