నాకు నచ్చిందే చేస్తానంటోన్న పెద్ద చెల్లెలు... నీకేది నచ్చితే అదే చేయమంటోన్న చిన్న చెల్లెలు...

ABN , First Publish Date - 2021-10-18T23:26:22+05:30 IST

తాను వృత్తిపరంగా ఇంటి నుంచీ బయటకు వెళితే కూతురు ఇనాయాను వదిలి వెళ్లాల్సి వస్తుందని చెప్పింది సోహా అలీఖాన్. కానీ, అలా చేసినప్పుడు ఎప్పుడూ ‘సారీ’ చెప్పనని కూడా ఆమె వివరించింది.

నాకు నచ్చిందే చేస్తానంటోన్న పెద్ద చెల్లెలు... నీకేది నచ్చితే అదే చేయమంటోన్న చిన్న చెల్లెలు...

తాను వృత్తిపరంగా ఇంటి నుంచీ బయటకు వెళితే కూతురు ఇనాయాను వదిలి వెళ్లాల్సి వస్తుందని చెప్పింది సోహా అలీఖాన్. కానీ, అలా చేసినప్పుడు ఎప్పుడూ ‘సారీ’ చెప్పనని కూడా ఆమె వివరించింది. ‘‘నిన్ను వదిలి వెళుతున్నందుకు సారీ... ’’ అని సోహా ఎప్పుడూ కూతురుతో అనలేదట. ఎందుకంటే, తాను ఏం చేయటాన్ని ఇష్టపడుతుందో... అది చేసేందుకు వెళుతున్నప్పుడు... క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అంటోంది. అదే సంగతి కూతురుకి కూడా అర్థమయ్యేలా వివరిస్తుందట...


సోహా అలీఖాన్ ‘తాను ప్రేమించే పని’ని తప్పకుండా చేస్తాను అంటుంటే... ఆమె చెల్లెలు సబా అలీఖాన్ ఓ నెటిజన్‌కు ఇంచుమించూ అదే మీనింగ్ వచ్చేలా రిప్లై ఇఛ్చింది! బాలీవుడ్ లెజెండ్రీ యాక్ట్రస్ షర్మిలా ఠాగూర్‌ సంతానంలో అందరి కంటే చిన్న సబా అలీఖాన్. ఆమె సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్‌లాగా యాక్టర్ కాలేదు. సాధారణ జీవితమే గడుపుతుంటుంది. దాంతో ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆమె పేజీలో కొంచెం తేడాగా మాట్లాడాడు. సబా అలీఖాన్ తన తల్లిదండ్రులు నవాబ్ అలీఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ ఎంగేజ్‌మెంట్ ఫోటో షేర్ చేసి... ‘ద రాయల్ వెడ్డింగ్...’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దాన్ని చూసి రియాక్ట్ అయిన ఒక ఆకతాయి నెటిజన్... ‘‘నువ్వు... నీ తల్లిదండ్రుల తాలూకూ గతంలోనే బతికేస్తున్నావ్‌గా...’’ అన్నాడు. అతడి వెటకారానికి సూటిగా స్పందించిన సబా అలీఖాన్... ‘‘నాకు నా తల్లిదండ్రులన్నా, వారి గతమన్నా ఎంతో ప్రేమ. నీకు ఏదిష్టమో అది చేసుకో’’ అంది! 


పెళ్లై కూతురు పుట్టాక కూడా ఇంకా నటిస్తోంది సైఫ్ పెద్ద చెల్లెలు సోహా. తనకు నచ్చిన సొషల్ మీడియా పోస్టులు పెడుతోంది చిన్న చెల్లెలు సబా. కానీ, ఇద్దరి ఫిలాసఫీ మాత్రం ఒక్కటే... ‘డూ వాట్ యు లవ్!’ ఆఫ్ట్రాల్, లైఫ్ అంటే... మనం మనసారా ప్రేమించే పని చేయటమే కదా...  

Updated Date - 2021-10-18T23:26:22+05:30 IST