క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్న సచిన్ కూతురు..?
ABN, First Publish Date - 2021-10-13T21:19:05+05:30
భారత్‌లో సినిమా, క్రికెట్ రెండు కళ్ల వంటివి. వీటిని వేరు చేసి చూడలేం. సినిమా సెలెబ్రిటీలకు ఎంత క్రేజ్ ఉంటుందో క్రికెటర్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. క్రికెటర్ల ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు
భారత్‌లో సినిమా, క్రికెట్ రెండు కళ్ల వంటివి. వీటిని వేరు చేసి చూడలేం. సినిమా సెలెబ్రిటీలకు ఎంత క్రేజ్ ఉంటుందో క్రికెటర్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. క్రికెటర్ల ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అందువల్ల వారి కొడుకు, కూతుళ్లకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఒక మాజీ క్రికెటర్ కూతురు, ఒక బ్యాట్స్‌మెన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్‌మెన్ అయిన శుభమన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ వదంతులపై ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పందించలేదు. కానీ, వీటికి బలం చేకూర్చేలా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని మరొకరు ఫాలో అవుతున్నారు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వుతున్నాయి. ఈ మధ్యనే బాల్కనీలో నిల్చొని ఉన్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. పట్టణంలోనే అన్ని నవ్వులున్నాయనే క్యాప్షన్‌ను ఆ ఫొటోకు జత చేసింది. అభిమానులు కూడా ఆ ఫొటోకు స్పందించారు. అనుకోని అతిథులుగా బాలీవుడ్ నుంచి కార్తిక్ ఆర్యన్, అర్మాన్ మాలిక్ కూడా ఆ ఫొటోకు కామెంట్ చేశారు.
ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఆమె పాఠశాల విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.