సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Alia Bhatt: ఒకటి కాదు రెండు కాదు.. RRR హీరోయిన్ నుంచి ఏకంగా మూడు తీపికబుర్లు..!

ABN, First Publish Date - 2021-10-02T00:17:02+05:30

మహేశ్ భట్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా అనంతరం తనని తను నిరూపించుకున్న నటి ఆలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలో టైటిల్ రోల్ పోషించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, గంగూబాయి కతియావాడి, రణం రౌద్రం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్), డార్లింగ్స్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఆమె వచ్చే ఏడాది ఎన్నో తీపి కబుర్లను వినిపించనుందని బాలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్ భట్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా అనంతరం తనని తను నిరూపించుకున్న నటి ఆలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలో టైటిల్ రోల్ పోషించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, గంగూబాయి కతియావాడి, రణం రౌద్రం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్), డార్లింగ్స్  తదితర చిత్రాల్లో నటిస్తోంది.  ఆమె వచ్చే ఏడాది ఎన్నో తీపి కబుర్లను వినిపించనుందని బాలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. ఆలియాకు మరిచిపోలేని సంవత్సరంగా 2022 నిలుస్తుందని సన్నిహిత వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి.


ఆలియా భట్ నటించిన చిత్రాల్లో రెండు 2022లో విడుదల కానున్నాయి. ఈ ఏడాది డిసెంబరులోనే ఆమె తన ప్రియుడు రణ్‌ బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకోనుందని సమాచారం. గంగూబాయి కతియావాడి జనవరి 6, 2022న రిలీజ్ అవుతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఆమె నటించిన రణం రౌద్రం రుధిరం కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుందని వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జనవరి 7న విడుదల అయితే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌తో బాక్సాఫీస్ వద్ద తలపడనుంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Updated Date - 2021-10-02T00:17:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!