సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

త్వరలో పెళ్లి చేసుకొబోతున్న Richa Chadha..?

ABN, First Publish Date - 2021-12-23T23:00:05+05:30

బాలీవుడ్‌లో ఈ ఏడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజ్‌కుమార్ రావ్- పత్రలేఖ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో ఈ ఏడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజ్‌కుమార్ రావ్- పత్రలేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్ ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నారు. 2022 ప్రారంభంలో రణ్‌బీర్ కపూర్ -ఆలియా భట్, సూరజ్ నంబియార్ -మౌనిరాయ్ పెళ్లి చేసుకొబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి మరొకరు చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆమెవరో కాదు.. మసాన్ చిత్రంలో నటించి అభిమానులకు చేరుమైన నటి రిచా చద్దా. 


రిచా గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడైన ఆలీ ఫజల్‌తో డేటింగ్ చేస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 2022 మార్చిలో వీరిద్దరూ పెళ్లి చేసుకొబోతున్నట్టు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2022 వేసవికాలంలో ఈ వేడుకలు జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ముంబైతో పాటు ఢిల్లీలోను ఈ పెళ్లి సంబరాలు జరగబోతున్నట్టు ఆంగ్లపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ వేడుకలకు బంధువులతో పాటు సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరవుతారని వారితో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి చెప్పారు. 


రిచా, ఆలీ 2020 ఏప్రిల్‌లో‌నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, కరోనా విలయ తాండవం చేయడంతో ఆ పెళ్లి వాయిదాపడింది. ‘‘ ఫక్రే ’’ సినిమా సెట్లో మొదటిసారిగా వీరిద్దరూ కలుసుకున్నారు. కొన్నాళ్లు స్నేహితులుగా తమ బంధాన్ని కొనసాగించారు. అనంతరం డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. పెళ్లికి సంబంధించిన వార్తలు హల్‌చల్  చేస్తున్నప్పటికి అధికారికంగా ఎవరూ కూడా స్పందించలేదు.  ‘‘ ఫుషింగ్ బటన్స్ స్టూడియో ’’ అనే సొంత నిర్మాణ సంస్థను కూడా వీరు స్థాపించారు. ప్రస్తుతం ఆలీ ఫజల్ హాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించే ‘‘ హీరామండీ ’’ వెబ్ సిరీస్‌లో కూడా అతడు నటించబోతున్నారు.   



Updated Date - 2021-12-23T23:00:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!