ట్రోలింగ్ చేసిన ఆరు నెలల తరువాత నెటిజన్స్‌ను తప్పుబట్టిన Kiara Advani

ABN , First Publish Date - 2021-12-27T23:12:06+05:30 IST

‘‘ఆ ట్రోలింగ్ సంగతి నా దృష్టికి కూడా వచ్చింది’’ అంటోంది కియారా అద్వాణీ. ‘‘నేను ఆయన్ని సెల్యూట్ చేయమని అడగలేదు... కానీ’’

ట్రోలింగ్ చేసిన ఆరు నెలల తరువాత నెటిజన్స్‌ను తప్పుబట్టిన Kiara Advani

‘‘ఆ ట్రోలింగ్ సంగతి నా దృష్టికి కూడా వచ్చింది’’ అంటోంది కియారా అద్వాణీ. ‘‘నేను ఆయన్ని సెల్యూట్ చేయమని అడగలేదు... కానీ, జనం నన్ను ట్రోల్ చేసేశారు. ఆ పెద్దాయన చేత నేను కావాలని అలా చేయించానని అన్నారు’’ అని చెబుతూ ఆర్నెల్ల క్రితం జరిగిన ఉదంతం గుర్తు చేసుకుంది. 


2021 జూలైలో కియారా ఓ సారి సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లింది. ఆమె కార్ దిగుతుండగా సెక్యూరిటీ గార్డ్ సెల్యూట్ చేశాడు. అయితే, వయస్సులో చాలా పెద్దవాడైన ఆయన అలా చేయటం నెటిజన్స్‌కు నచ్చలేదు. అతడి చేత కియారా కావాలని సెల్యూట్ చేయించుకుందంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే, అప్పట్లో బాలీవుడ్ బ్యూటీ మౌనంగా ఉండిపోయింది. ఆర్నెల్ల తరువాత ఇప్పుడు తన వర్షన్ వివరించింది. 


సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న పెద్దాయన చేత తాను ఉద్దేశ్యపూర్వకంగా నమస్కారం చేయించుకోలేదని అంటోన్న కియారా జనం అక్కడ ఏం జరిగిందో పట్టించుకోకుండా, తెలుసుకోకుండా ట్రోల్ చేశారని వాపోయింది. కేవలం ఒక ఫోటో చూసి తన గురించి రకరకాలుగా మాట్లాడారని కియారా చెప్పింది. అసలు ఆ ట్రోలింగ్ మొత్తం అనవసరం అని ఆమె అభిప్రాయపడింది.

Updated Date - 2021-12-27T23:12:06+05:30 IST