Raveena Tandon : వర్మ తనని ‘అటువంటి లుక్’లో ఊహించుకోలేకపోయాడట!
ABN, First Publish Date - 2021-12-29T03:53:29+05:30
‘శూల్’ సినిమా విడుదల తరువాత ప్రేక్షకులు రవీనాని హౌజ్ వైఫ్‌గా చూసి అవాక్కయ్యారు. కానీ, అంతకంటే ముందే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సేమ్ ఫిలింగ్‌కి లోనయ్యాడంటోంది రవీనా!
రామ్ గోపాల్ వర్మ కథతో, ఆయన నిర్మాణంలోనే వచ్చిన బాలీవుడ్ మూవీ ‘శూల్’. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్‌కి ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించాడు. అయితే, అందులో అందర్నీ ఆశ్చర్యపరిచింది మాత్రం రవీనా టాండన్. ఆమెని అప్పటి వరకూ అందరూ గ్లామర్ గాడెస్‌గా మాత్రమే చూశారు. ‘టిప్ టిప్ బర్సా పానీ, అక్కీయోంసే గోలీమారే’ లాంటి పాటలతో 90ల నాటి యువతని రవీనా ఉర్రూతలూగించింది. కానీ, హఠాత్తుగా ‘శూల్’ సినిమాలో మాత్రం ఓ మధ్యతరగతి బీహారీ గృహిణిగా, మనోజ్ బాజ్‌పాయ్ పాత్రకి భార్యగా కనిపించింది. ఆమెని అప్పట్లో ఎవ్వరూ ‘ఆ లుక్’లో అసలు ఊహించలేదు...
‘శూల్’ సినిమా విడుదల తరువాత ప్రేక్షకులు రవీనాని హౌజ్ వైఫ్‌గా చూసి అవాక్కయ్యారు. కానీ, అంతకంటే ముందే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సేమ్ ఫిలింగ్‌కి లోనయ్యాడంటోంది రవీనా! ఆయన అసలు గ్లామరస్ బ్యూటీని ‘శూల్’ సినిమాకి వద్దే వద్దనుకున్నాడట. 1990లలో అనేక సినిమాల్లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన రవీనాని ఆర్జీవి ఎంత మాత్రం మిడిల్ క్లాస్ హౌజ్ వైఫ్‌గా ఊహించలేకపోయాడట. అదే విషయం ఆమెతో చెప్పాడట కూడా. ఆనాటి తన అనుభవం ఈ మధ్యే గుర్తు చేసుకున్న బీ-టౌన్ సీనియర్ బ్యూటీ ‘‘నేను మేకప్ వేసుకుని ఎదురుపడ్డాక... మొదటి సారి రామ్ గోపాల్ వర్మ గుర్తు కూడా పట్టలేకపోయారు!’’ అంది.
తన కెరీర్‌లో చాలా వరకూ కమర్షియల్ సినిమాలే చేసిన రవీనా టాండన్ పెళ్లికి ముందు కొన్ని సీరియస్ మూవీస్ చేసింది. వాటిల్లో తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ‘శూల్’తో మొదలు పెట్టిన ఆమె మధుర్ బండార్కర్ ‘సత్తా’, కల్పనా లజ్మీ ‘దామన్’ వంటి సినిమాలతో తన టాలెంట్‌ని చాటుకుంది. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ కూడా అందుకుంది.