సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Raveena Tandon : పుకార్ల కారణంగా ‘ఆ సీనియర్ నటి’ సోదరి ఆత్మహత్యకి ప్రయత్నించింది!

ABN, First Publish Date - 2021-12-23T21:45:28+05:30

సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ ఒకప్పటి బాలీవుడ్‌ను జ్ఞాపకం చేసుకుంది. 1990లలో ఆమె బీ-టౌన్‌లో బిజీ స్టార్. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఆమెకి పుకార్లతో మాత్రం పెద్ద తలనొప్పి తప్పేదికాదట. ఆమెకే కాదు, అప్పట్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ ఒకప్పటి బాలీవుడ్‌ను జ్ఞాపకం చేసుకుంది. 1990లలో ఆమె బీ-టౌన్‌లో బిజీ స్టార్. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఆమెకి పుకార్లతో మాత్రం పెద్ద తలనొప్పి తప్పేదికాదట. ఆమెకే కాదు, అప్పట్లో నటీనటులు అందరికీ టాబ్లాయిడ్స్ రూపంలో నిరంతరం బెడద ఉండేదని చెప్పింది రవీనా. ఆ పత్రికల ఎడిటర్స్ దయాదాక్షిణ్యాల మీద యాక్టర్స్ పరువు ఆధారపడి ఉండేదని వాపోయింది. 


‘ఫిల్మ్‌ఫేర్’కి రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా అప్పట్లో జరిగిన ఓ ఉదంతం గుర్తు చేసుకుంది. ఓ పత్రికలో ఆనాటి సీనియర్ నటి సోదరి గురించి గాసిప్ అచ్చైందట. దాని సారాంశం ఏంటంటే... సదరు యాక్ట్రస్ హజ్బెండ్‌ని ఆమె సిస్టరే బుట్టలో వేసుకుందని! నిజంగా మాత్రం అటువంటిదేం జరగనేలేదట! 


అక్క భర్తనే మాయ చేసిందంటూ పత్రికల వాళ్లు రాయటంతో ఆనాటి సీనియర్ నటి సోదరి ఆత్మహత్యకి ప్రయత్నించి హాస్పిటల్ పాలైందని రవీనా చెప్పుకొచ్చింది. ఇప్పుడైతే సొషల్ మీడియా ఉండటంతో మీడియాలో వచ్చే పుకార్లను ఖండించే అవకాశం సెలబ్రిటీలకు ఉంటోందని కూడా ఆమె అభిప్రాయపడింది. అయితే,  గతంలో కంటే ఇప్పుడు టాబ్లాయిడ్ జర్నలిజం మెరుగైందని కూడా రవీనా అంగీకరిస్తోంది. ఇష్టానుసారం పుకార్లు రాసే సంస్కృతి కొంత వరకు తగ్గిందట...   

Updated Date - 2021-12-23T21:45:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!