Rashi khanna : ‘రుద్ర’ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తి
ABN , First Publish Date - 2021-11-17T17:25:22+05:30 IST
టాలీవుడ్ అందాల రాశి.. రాశీ ఖన్నా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూండడంతో పాటు.. బాలీవుడ్ కోటలోనూ పాగా వేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే.. రాశీఖన్నా మొట్టమొదటి సారిగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ తో నటిస్తున్నారు. అజయ్ డిజిటల్ డెబ్యూ ఈ సిరీస్ తోనే అవడం విశేషం. ‘ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సిరీస్ రూపొందుతోంది.

టాలీవుడ్ అందాల రాశి.. రాశీ ఖన్నా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూండడంతో పాటు.. బాలీవుడ్ కోటలోనూ పాగా వేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే.. రాశీఖన్నా మొట్టమొదటి సారిగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ తో నటిస్తున్నారు. అజయ్ డిజిటల్ డెబ్యూ ఈ సిరీస్ తోనే అవడం విశేషం. ‘ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సిరీస్ రూపొందుతోంది. నిజానికి ఈ సిరీస్ బ్రిటీష్ సూపర్ హిట్ సిరీస్ ‘లూథర్’ కు రీమేక్ వెర్షన్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ‘రుద్ర’ వెబ్ సిరీస్ ను రూపొందిస్తోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ లో అజయ్ దేవ్‌గణ్ పాత్ర చాలా ఆసక్తిగా ఉండనుంది. అలాగే ఇందులో రాశీఖన్నా పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. అలాంటి ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు రాశీ ఖన్నా తన ఇన్ స్టా ఖాతాలో తెలియచేశారు. సెట్ లో ‘రుద్ర’ టీమ్ తో కలిసి ఆమె కేక్ కూడా కట్ చేసిన ఫోటోను షేర్ చేశారు.
‘రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయింది. నా కెరీర్ లోనే ఎంతో ఛాలెంజింగ్ రోల్ ఇది. ఇందులో నా పాత్రకి నేను న్యాయం చేశానని ఆశిస్తున్నాను. ఈ విషయంలో దర్శకుడు మపుస్కర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ఈ సినిమాకి మూల స్తంభంలా నిలిచారు. అజయ్ దేవ్‌గణ్ సార్ అద్భుతమైన సహనటుడు. అలాగే ఈ సిరీస్ కు సహకరించిన టీమ్ తో నా జెర్నీ చాలా బాగుంది. ఈ సిరీస్ విడుదలయ్యే వరకూ ఆగలేకపోతున్నాను’.. అంటూ ఓ వ్యాఖ్య కూడా జతచేశారు.