దీపికా మూవీ ‘83’పై కేసు.. అది ప్రచార గిమ్మిక్కు మాత్రమేనంటూ..

ABN , First Publish Date - 2021-12-14T16:19:40+05:30 IST

హిందీ సినీ పరిశ్రమ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ ‘83’. కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తున్న ఈ సినిమాలో కపిల్ పాత్రలో రణ్‌వీర్ సింగ్, ఆయన భార్య రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొనే నటిస్తోంది.

దీపికా మూవీ ‘83’పై కేసు.. అది ప్రచార గిమ్మిక్కు మాత్రమేనంటూ..

హిందీ సినీ పరిశ్రమ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ ‘83’. కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తున్న ఈ సినిమాలో కపిల్ పాత్రలో రణ్‌వీర్ సింగ్, ఆయన భార్య రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొనే నటిస్తోంది. 1983లో ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌లోని క్రికెట్ స్టార్స్ పాత్రలో ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.


అయితే ఇటీవలే ఈ సినిమా మేకర్స్‌పై తెలంగాణ హైకోర్టులో యూఏఈ బేస్ట్ కంపెనీ ఛీటింగ్ కేసు ఫైల్ చేసింది. ఈ కేసుపై విబ్రీ మీడియా ఓ స్టెట్‌మేంట్‌ని విడుదల చేసింది. అందులో.. కేసు పెట్టిన ఫ్యూచర్ రిసోర్సెస్ ఎఫ్‌జెడ్‌ఈకి వారి కంపెనీలో చాలా తక్కువ షేర్ ఉందని తెలిపింది. వారి కంప్లైంట్స్ అబద్ధం, నిరాధారమని.. అవి కేవలం ప్రచారం కోసమే అలా చేస్తోందని చెప్పింది.


ఆ స్టేట్‌మెంట్‌లో.. ‘ఈ సినిమా విడుదలకు ముందు ఫ్యూచర్ రిసోర్సెస్ కావాలనే కంప్లైట్ ఫైల్ చేసింది. ఇది కేవలం ప్రచార గిమ్మిక్కు మాత్రమే. దీనిపై విబ్రీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫిర్యాదుపై న్యాయపరమైన పరిష్కారాలకు శోధిస్తోంది. ‘83’ మూవీ మేకర్స్ త్వరలోనే ఆ అబద్ధపు కంప్లైంట్‌పై సరైన చర్యలు తీసుకుంటార‌’ని తెలిపారు.

Updated Date - 2021-12-14T16:19:40+05:30 IST