ఆస్పత్రిలో Salman Khan.. వైరల్‌గా మారిన పిక్..
ABN , First Publish Date - 2021-12-27T02:25:32+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డిసెంబర్ 26న తెల్లవారుజామున పాము కాటుకు గురయ్యాడు. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉండగా

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డిసెంబర్ 26న తెల్లవారుజామున పాము కాటుకు గురయ్యాడు. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్లు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. అనంతరం సల్లూ భాయ్‌ను చికిత్స నిమిత్తం ఎమ్జీఎమ్ ఆస్పత్రికి తరలించారు. బాలీవుడ్ భాయిజాన్ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే, ఆసుపత్రిలో సల్మాన్ విశ్రాంతి తీసుకుంటున్న పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటో కింద అభిమానులు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ సల్మాన్ త్వరగా కొలుకోవాలి ’’ అని అభిమానులు స్పందనను తెలుపుతున్నారు.
సల్మాన్ 56వ పుట్టిన రోజును డిసెంబర్ 27న జరుపుకొబోతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకొనేందుకు పన్వేలీలోని ఫామ్‌హౌస్‌కి చేరుకున్నాడు. అతడి ఫామ్‌హౌస్ అటవీ ప్రాంతంలో ఉంది. పాములు, కొండచిలువలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. సల్లూ భాయ్ సరదాగా బయట తిరుగుతున్నప్పుడు పాము కాటు వేసిందని తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని పేర్కొన్నారు. ‘‘ ప్రస్తుతం సల్మాన్ బాగానే ఉన్నారు. అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. విషరహిత పాము అతడిని కుట్టింది. కొన్ని మందులను తీసుకొమని డాక్టర్ సూచించారు ’’ అని సలీమ్ ఖాన్ తెలిపారు.