స‌ల్మాన్ ‘రాధే’ తొలి రోజు ఎంత రాబ‌ట్టిందంటే?

ABN , First Publish Date - 2021-05-15T15:23:35+05:30 IST

*రాధే పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో జీ సంస్థ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌గా, తొలిరోజునే 42 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను ద‌క్కించుకుంది. ఇక బిజినెస్ ప‌రంగా

స‌ల్మాన్ ‘రాధే’ తొలి రోజు ఎంత రాబ‌ట్టిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘రాధే’. ఈద్ సంద‌ర్భంగా మే 13న ఈ సినిమా జీ ప్రీమియ‌మ్‌, జీ ఫ్లెక్స్ ఓటీటీల్లో విడుద‌లైంది. సినిమా బాగోలేద‌ని టాక్ తెచ్చుకుంది. అయితే కూడా సినిమాకు మంచి ఆద‌ర‌ణే ద‌క్కింది. పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో జీ సంస్థ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌గా, తొలిరోజునే 42 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను ద‌క్కించుకుంది. ఇక బిజినెస్ ప‌రంగా చూస్తే ‘రాధే’ సినిమా తొలి రోజున వంద కోట్ల రూపాయ‌ల‌ను రాబ‌ట్టుకుంది. ఇదంతా స‌బ్‌స్క్రిప్ష‌న్‌, వ్యూస్ వ‌ల్ల‌నే వ‌చ్చిన వ‌చ్చాయి. ఇందులో ఎలాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌ ట్యాక్స్ వంటి లేవు. ఆ క్ర‌మంలో జీ సంస్థ మంచి వ‌సూళ్ల‌ను రాబట్టుకున్న‌ట్లేన‌ని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. 

Updated Date - 2021-05-15T15:23:35+05:30 IST