సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Puneeth Rajkumar అంత్యక్రియలు వాయిదా!

ABN, First Publish Date - 2021-10-30T19:53:40+05:30

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ కంఠీరవ స్టేడియంలో ఉన్న పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా అక్కడకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. కాగా, పునీత్ అంత్యక్రియలను ఈ రోజు (శనివారం) జరిపించాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు రాక ఆలస్యమవుతోంది. 


ఈ నేపథ్యంలో పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేసినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కుటుంబ సభ్యుల రాక ఆలస్యం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. పునీత్ పెద్ద కూతురు ఇప్పటికే అమెరికా నుంచి బయల్దేరింది. కాగా, ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు.  

Updated Date - 2021-10-30T19:53:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!