సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సోనా రెస్టారెంట్‌లో ప్రియాంక చోప్రా!

ABN, First Publish Date - 2021-06-28T02:07:31+05:30

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా.. న్యూయార్క్‌ సిటీలో సోనా పేరుతో రెస్టారెంట్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే! 2019 సెప్టెంబరులో దీని నిర్మాణం మొదలుపెట్టారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా.. న్యూయార్క్‌ సిటీలో సోనా పేరుతో రెస్టారెంట్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే! 2019 సెప్టెంబరులో దీని నిర్మాణం మొదలుపెట్టారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత మొదటిసారి తన హోటల్‌లో అడుగుపెట్టారామె. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా ఇన్‌స్ట్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశారు. హోటల్‌ సిబ్బందితో, పానీ పూరి రుచిని ఆస్వాదిస్తున్న ఫొటోలను ప్రియాంక షేర్‌ చేశారు. ‘‘మూడేళ్ల ప్లానింగ్‌ తర్వాత సోనా పూర్తయింది. కిచెన్‌లోకి వెళ్లాలని, మా హోటల్‌ బృందాన్ని కలవాలని నా మనసు ఎంతో తహతహలాడేది. మిమీస్‌ పేర రూపొందించిన ప్రైవేటు డైనింగ్‌ రూం, ఇంటీరియర్‌, రుచికరమైన ఆహారం, డ్రింక్స్‌ అద్భుతంగా ఉన్నాయి’’ అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. 






Updated Date - 2021-06-28T02:07:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!