సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నా శరీరం గురించి కామెంట్లు చేస్తూనే ఉన్నారు: Priyanka Chopra

ABN, First Publish Date - 2021-10-09T17:33:26+05:30

ప్రియాంకా చోప్రా.. దాదాపు రెండు దశాబ్దాలు బాలీవుడ్‌లో మెరిసిన ఈ అందం ప్రస్తుతం హాలీవుడ్‌లో సత్తా చాటుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రియాంకా చోప్రా.. దాదాపు రెండు దశాబ్దాలు బాలీవుడ్‌లో మెరిసిన ఈ అందం ప్రస్తుతం హాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. 39 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్‌ను వివాహం చేసుకుని అమెరికాకు మకాం మార్చిన ప్రియాంక.. హాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటోంది. గతంలో విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న ప్రియాంక చిన్నప్పటి నుంచే బాడీ షేమింగ్ ఎదుర్కొంటోందట. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించింది. 


`నా శరీరం గురించి ఇతరులు చేసే కామెంట్లను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. 20 ఏళ్ల వయసులో నా రంగు గురించి మాట్లాడారు. హీరోయిన్‌గా మారిన తర్వాత ఓ దశలో నేను బరువు పెరిగాను. మా నాన్న చనిపోయిన తర్వాత ఆ బాధలో నేను ఎక్కువ తినడం ప్రారంభించాను. దాంతో బరువు పెరిగాను. అప్పుడు నా శరీరాకృతి గురించి మాట్లాడారు. ఇప్పుడు వయసు అయిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు అలాంటి కామెంట్లను పట్టించుకుని చాలా బాధపడిపోయేదాన్ని. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. ఇతరుల మాటలను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా శరీరంతో, మనసుతో ఇప్పుడు నేను చాలా సౌకర్యంగా ఉన్నాన`ని ప్రియాంక చెప్పింది. 

Updated Date - 2021-10-09T17:33:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!