పూజా బేడీకి కరోనా పాజిటివ్.. అయినా `నో వ్యాక్సినేషన్`!
ABN , First Publish Date - 2021-10-18T19:02:04+05:30 IST
బాలీవుడ్ నటీమణి పూజా బేడీ కరోనా బారిన పడింది

బాలీవుడ్ నటీమణి పూజా బేడీ కరోనా బారిన పడింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తనకు డస్ట్ అలర్జీ ఉందని, రెగ్యులర్‌గా తమ్ములు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటానని, అయితే తాజాగా జ్వరం కూడా రావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని తెలిపింది. ఆ టెస్ట్‌లో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపింది.
తన బాయ్‌ఫ్రెండ్‌కు, తన ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా సోకిందని తెలిపింది. ప్రస్తుతం తాము కోలుకుంటున్నామని, తమ గురించి ప్రార్థనలు చేయమని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. అయితే వ్యాక్సిన్ వేసుకోకూడదనేది తన వ్యక్తిగత నిర్ణయమని, ఆ స్వేచ్ఛ తనకు ఉందని పూజ స్పష్టం చేసింది. తన శరీరంలో స్వతహాగా ఉన్న వ్యాధి నిరోధక శక్తితో, ఇతర మార్గాల ద్వారా కోవిడ్ నుంచి బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేసింది.