Bell Bottom: ఇందిరాగాంధీ పాత్రలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ABN , First Publish Date - 2021-08-05T02:16:40+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్‌గా నటించిన ‘బెల్ బాటమ్’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. 1984, ఇండియాలో జరిగిన విమానాల హైజాక్ ఘటనల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం రూపొందింది. రంజిత్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్‌గా నటించిన ‘బెల్ బాటమ్’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. 1984, ఇండియాలో జరిగిన విమానాల హైజాక్ ఘటనల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం రూపొందింది. రంజిత్ ఎం.తివారీ దర్శకత్వం స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్స్, ఎమ్మా ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పాత్ర పోషించిన నటి విషయంలో ఈ సినిమాలో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇంతకీ ట్రైలర్ ఆ పాత్ర పోషించిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఆ పాత్రలో నటించిన హీరోయిన్ సేమ్ టు సేమ్ ఇందిరాగాంధీలానే కనిపించడంతో.. ఎవరు ఆ పాత్ర చేశారా? అని సెర్చ్ చేసిన నెటిజన్లు.. ఆ పాత్ర చేసిన నటి ఎవరో తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అస్సలు గుర్తుపట్టలేకపోయాం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరనుకుంటున్నారు? లారా దత్తా. ‘‘ఇందిరాగాంధీ వంటి దిగ్గజ వ్యక్తి పాత్రలో చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ పాత్రను బాధ్యతగా స్వీకరించాను. ఆమె పాత్రలో చేస్తున్నప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్‌కు మారాలి. నేను అదే చేశాను..’’ అని లారా దత్తా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చెప్పిన తర్వాత కానీ ఆమె ఈ పాత్ర చేసినట్లుగా తెలియలేదు. ఈ పాత్ర కోసం లారా దత్తా మారిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని ఆగస్ట్ 19న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
