సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రిషి కపూర్‌ చివరి సినిమాలో... రిషి బదులు పరేష్‌!

ABN, First Publish Date - 2021-09-05T05:30:00+05:30

హిందీ హీరో రిషి కపూర్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లి ఏడాది దాటింది. అయితే, చిత్ర పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. రిషి కపూర్‌ పలు చిత్రాలను ప్రేక్షకులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందీ హీరో రిషి కపూర్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లి ఏడాది దాటింది. అయితే, చిత్ర పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. రిషి కపూర్‌ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. మరణించడానికి కొన్ని రోజుల ముందు ‘శర్మాజీ నమ్‌కీన్‌’ చిత్రీకరణ చేశారు. సినిమా పూర్తి కాకముందే లోకాన్ని విడిచారు. దాంతో మిగతా సన్నివేశాల్లో రిషి కపూర్‌ బదులు పరేష్‌ రావల్‌ నటించారు. ఇప్పుడు సినిమా చిత్రీకరణ పూర్తయింది. రిషి కపూర్‌ ఫస్ట్‌లుక్‌ను శనివారం ఆయన జయంతి సందర్భంగా కుమార్తె రిద్ధిమా కపూర్‌ విడుదల చేశారు. తన తండ్రి ఆకస్మిక మరణంతో అర్థాంతరంగా ఆగిన సినిమాలో, తండ్రి బదులు అదే పాత్రలో నటించడానికి అంగీకరించిన పరేష్‌ రావల్‌కు రిద్ధిమ కృతజ్ఞతలు తెలిపారు. హితేష్‌ భాటియా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


Updated Date - 2021-09-05T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!