సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చనిపోయాడనే రూమర్స్‌పై పరేష్ రావల్ రియాక్షన్ ఇదే

ABN, First Publish Date - 2021-05-15T04:55:28+05:30

శుక్రవారం ఉదయం 7 గంటలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ చనిపోయినట్లుగా సోషల్ మీడియా అంతా వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన చనిపోయింది నిజమే అనుకుని.. ట్విట్టర్‌లో నెటిజన్లు ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్స్ చేశారు. అయితే ట్విట్టర్‌లో ఎప్పుడూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శుక్రవారం ఉదయం 7 గంటలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ చనిపోయినట్లుగా సోషల్ మీడియా అంతా వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన చనిపోయింది నిజమే అనుకుని.. ట్విట్టర్‌లో నెటిజన్లు ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్స్ చేశారు. అయితే ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే పరేష్ రావల్.. తను చనిపోయినట్లుగా వస్తున్న వార్తను చూసి.. నవ్వుకోవడమే కాకుండా.. ట్విట్టర్ వేదికగా చమత్కారంగా రియాక్ట్ అయ్యారు.


‘‘మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించాలి.. ఉదయం 7గంటలకు నేను నిద్రపోతూ ఉన్నాను’’ అంటూ పరేష్ రావల్ రిప్లయ్ ఇచ్చారు. ఇటీవల పరేష్ రావల్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకుని.. ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఎవరు సృష్టించారో తెలియదు కానీ.. ఆయన చనిపోయాడనే రూమర్ సోషల్ మీడియా అంతా వేగంగా వ్యాపించేసింది. ఆయన సమాధానం ఇచ్చే వరకు ఆయనకు నెటిజన్లు ‘రెస్ట్ ఇన్ పీస్’ మెసేజ్‌లు పెడుతూనే ఉన్నారు. అసలు విషయం తెలిశాక.. సోషల్ మీడియా ఎంత ప్రమాదకరమైనదో.. మరోసారి పరేష్ రావల్ విషయంలో తెలిసిందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.



Updated Date - 2021-05-15T04:55:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!