పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా!

ABN , First Publish Date - 2021-11-14T07:57:25+05:30 IST

దేశ స్వాతంత్య్రం విషయంలో ప్రముఖ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. ‘1947లో ఈ దేశానికి వచ్చింది స్వాతంత్య్రం కాదు. అది భిక్ష మాత్రమే. 2014లోనే అసలైన విముక్తి లభించింది’ అంటూ ఇటీవల...

పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా!

దేశ స్వాతంత్య్రం విషయంలో ప్రముఖ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. ‘1947లో ఈ దేశానికి వచ్చింది స్వాతంత్య్రం కాదు. అది భిక్ష మాత్రమే. 2014లోనే అసలైన విముక్తి లభించింది’ అంటూ ఇటీవల కంగన కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి. దేశ స్వాతంత్ర్యాన్ని, అందుకోసం ఎన్నో త్యాగాలు చేసిన సమరయోధుల్నీ కంగన తన వ్యాఖ్యలతో కించపరిచిందని, ఆమెను అరెస్ట్‌ చేయాలని, ఆమెకిచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని శివసేన పార్టీ గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. దీనిపై కంగన కూడా స్పందిస్తూ ఇన్‌స్టాలో మరికొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. ‘‘1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామం గురించి నేను కొంత శోధన చేశాను. అప్పుడు జాతీయవాదం విపరీతంగా ఉండేది. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అప్పట్లో భగత్‌ సింగ్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆ సమయంలో గాంధీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మత కలహాలు ఎందుకు రేగాయి? 1857లో ఏం జరిగిందో నాకు తెలుసు. 1947లో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరా? నా వ్యాఖ్యలు తప్పు అని ఎవరైనా నిరూపిస్తే... నాకు వచ్చిన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తా. ఓ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యల్ని కట్‌ చేసి, వాటిని ఎడిట్‌ చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసి, అప్పుడు మాట్లాడితే మంచిది’’ అని పేర్కొన్నారు కంగన.


Updated Date - 2021-11-14T07:57:25+05:30 IST