సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ది కపిల్ శర్మ షో' స్టార్స్.. ఎపిసోడ్‌కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..

ABN, First Publish Date - 2021-11-15T22:51:35+05:30

‘ది కపిల్ శర్మ షో' నిస్సందేహంగా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో ఒకటి. సూపర్‌హిట్ షోను స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ది కపిల్ శర్మ షో' నిస్సందేహంగా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో ఒకటి. సూపర్‌హిట్ షోను స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్నారు. ఈ షో ప్రస్తుతం ప్రసారం అవుతుండగా.. అధిక టీఆర్‌పీ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇందులో కపిల్ శర్మతో పాటు, కృష్ణ అభిషేక్, చందన్ ప్రభాకర్, కికు శారదా, సుమోనా చక్రవర్తి, భారతీ సింగ్, న్యాయనిర్ణేత అర్చన పురాన్ సింగ్ 'ది కపిల్ శర్మ షో'లో ముఖ్యమైన భాగం. ఈ స్టార్స్ ఎపిసోడ్ తీసుకునే ఫీజు గురించి ఒకసారి చూద్దాం..


1.కపిల్ శర్మ..

కపిల్ శర్మ ఇంతకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.30-35 లక్షల మధ్య వసూలు చేసేవాడు. కానీ ఇప్పుడు అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.


2. కృష్ణ అభిషేక్..

కృష్ణ అభిషేక్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.10-12 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.


3. అర్చన పురాన్ సింగ్..

యాంకర్‌గా, నటిగా హిందీ పరిశ్రమ గుర్తింపు పొందింది అర్చన పురాన్ సింగ్. ఈ సినీయర్ నటి షో జడ్జీ వ్యవహారిస్తూ.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 10 లక్షల చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం.


4. భారతీ సింగ్

షోలో తిత్లీ యాదవ్, కమ్మో బువా వంటి అనేక పాత్రలను పోషించిన హాస్యనటి భారతీ సింగ్. ఈమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 10-12 లక్షలు తీసుకుంటుందటా.


5. చందన్ ప్రభాకర్

షోలో వివిధ క్యారెక్టర్స్ ప్లే చేసే హాస్యనటుడు చందన్ ప్రభాకర్. ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు రూ.7 లక్షలు తీసుకుంటాడంటా.


6. కికు శారదా..

కికు శారదా ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటుంది.


7. సుమోనా చక్రవర్తి..

సుమోనా చక్రవర్తి 'ది కపిల్ శర్మ షో' ఎపిసోడ్‌కు రూ. 6-7 లక్షలు తీసుకుంటారని సమాచారం.

Updated Date - 2021-11-15T22:51:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!