వైరల్‌గా మారిన Aryan Khan పాత వీడియో.. ఓ బిచ్చగత్తె అతడి కారు వద్దకు వస్తే..

ABN , First Publish Date - 2021-10-04T21:40:51+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌లో కలకలం రేపింది.

వైరల్‌గా మారిన Aryan Khan పాత వీడియో.. ఓ బిచ్చగత్తె అతడి కారు వద్దకు వస్తే..

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. ముంబై నగర శివారు సముద్ర తీరంలోని ఓ క్రూయిజ్‌లో జరిగిన రేవ్ పార్టీ గురించి సమాచారం అందుకున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడి చేశారు. భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. షారూక్ తనయుడు ఆర్యన్‌తో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఆర్యన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. 


అతను ఎప్పట్నుంచో డ్రగ్స్‌కు బానిసగా మారిపోయాడని, షారూక్ కూడా అతడిని పట్టించుకోలేదని.. ఇలా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు సంబంధించిన ఓ పాత వీడియోను షారూక్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. 2018 సంవత్సరంలో బయటకు వచ్చిన ఆ వీడియోలో మలైకా అరోరా, ఇతర స్నేహితులతో కలిసి ముంబైలోని బస్తిన్ రెస్టారెంట్ నుంచి ఆర్యన్ బయటకు వస్తున్నాడు. కారు వద్దకు వెళ్తుండగా ఓ బిచ్చగత్తె చిన్నారిని ఎత్తుకుని ఆర్యన్ వద్దకు వచ్చింది. ఆమెను చూసిన ఆర్యన్.. జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. ఆర్యన్ ఎంతో మానవత్వం కలిగిన మనిషి అంటూ షారూక్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. Updated Date - 2021-10-04T21:40:51+05:30 IST