సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డిసెంబర్‌లో కాదు.. వచ్చే ఏడాదే!

ABN, First Publish Date - 2021-11-30T06:47:24+05:30

బాలీవుడ్‌ ప్రేమజంట రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి నిరాశ కలిగించే న్యూస్‌ ఇది. వారి పెళ్లి మరోసారి వాయిదా పడింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ ప్రేమజంట రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి నిరాశ కలిగించే న్యూస్‌ ఇది. వారి పెళ్లి మరోసారి వాయిదా పడింది. మొదట అనుకున్న ప్రకారం డిసెంబర్‌లో వారిద్దరి పెళ్లి జరగాలి. అయితే అది వాయిదా పడిందనీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కానీ, మేలో కానీ ఉండవచ్చని తాజా సమాచారం. కానీ ఈ విషయాన్ని రణ్‌బీర్‌ కానీ అలియా కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.


దాదాపు నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాదే పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనుకున్నారు కానీ కరోనా వచ్చి ఆ పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేసింది. ఆత్మీయులు, సినీ ప్రముఖులు, ఇతర అతిధుల సమక్షంలో భారీగా హిందూ సంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరగాలన్నది రణ్‌బీర్‌, అలియా కోరిక. పరిస్థితులన్నీ చక్కబడడంతో పాటు తమకున్న కమిట్‌మెంట్స్‌ అప్పటికి పూర్తవుతాయి కనుక వివాహాన్ని వాయిదా వేశారని తెలుస్తోంది. వీరిద్దరు కట్టుకుంటున్న ఇల్లు కూడా వచ్చే ఏడాదికి సిద్ధమవుతుంది కనుక పెళ్లి వాయిదా వేయడానికి అది కూడా కారణం అంటున్నారు.

Updated Date - 2021-11-30T06:47:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!