షారూఖ్ తనయుడి డ్రగ్స్ కేసులో కొత్త నిజాలు.. శానిటరీ ప్యాడ్స్‌తో సహా ఎక్కడెక్కడ డ్రగ్స్‌ను దాచారంటే..

ABN , First Publish Date - 2021-10-04T20:46:50+05:30 IST

ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌తో సహా ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు

షారూఖ్ తనయుడి డ్రగ్స్ కేసులో కొత్త నిజాలు.. శానిటరీ ప్యాడ్స్‌తో సహా ఎక్కడెక్కడ డ్రగ్స్‌ను దాచారంటే..

ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌తో సహా ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు  అరెస్టు చేశారు. పోలీసులు రైడ్ చేయడం మొదలుపెట్టగానే పోలీసులు అనుమానించడానికి వీలు లేని చోట్ల వీరు డ్రగ్స్‌ను భద్రపరిచారు.


ఎన్సీబీ వర్గాల కథనం ప్రకారం..ఆర్యన్‌ ఖాన్ లెన్స్ కవర్‌లో డ్రగ్స్ దాచిపెట్టినట్టు సమాచారం. మున్మున్ ధమిచ శానిటరీ పాడ్‌లో డ్రగ్స్‌ను భద్రపరిచారు. అర్భాజ్ మర్చంట్ షూస్ లోపల మాదకద్రవ్యాలను దాచిపెట్టగా, ఇద్దరు డ్రగ్స్‌ను దూరంగా విసరడానికి ప్రయత్నించారు. అరెస్టు అయిన అందరిపై పోలీసులు నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్(ఎన్‌డీపీఎస్)లోని 4 సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు.


ఆ క్రూయిజ్ షిప్ ముంబయి నంచి గోవా మధ్య అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక వేళ డ్రగ్ పార్టీ చేసుకుంటు పట్టుబడిన భారతీయ చట్టాలు వారికి వర్తించవని నిందితులు భావించినట్టు సమాచారం. పోలీసులకు ఈ విషయం తెలుసు కావున భారతీయ జలాల్లోనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-10-04T20:46:50+05:30 IST