అంత్యక్రియలల్లో వాడే కలెక్షన్ ఇదేనంటూ Sabyasachi ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ABN , First Publish Date - 2021-11-29T21:57:30+05:30 IST
బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఫ్యాషన్ దుస్తులను డిజైన్ చేస్తూ పేరు తెచ్చుకున్నవాడు సబ్యసాచి ముఖర్జీ. కొన్నిరోజుల క్రితం అతడు తీసుకొచ్చిన మంగళ సూత్ర కలెక్షన్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఫ్యాషన్ దుస్తులను డిజైన్ చేస్తూ పేరు తెచ్చుకున్నవాడు సబ్యసాచి ముఖర్జీ. కొన్నిరోజుల క్రితం అతడు తీసుకొచ్చిన మంగళ సూత్ర కలెక్షన్ యాడ్ క్యాంపెయిన్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ ఒక మతం వారి మనోభవాలు కించపరిచేలా ఉంది అని కొంతమంది ఆరోపించారు. ఆ యాడ్‌లో అసభ్యకరంగా మోడల్స్ కనిపించారు. దీంతో నెటిజన్లు అతడిని తీవ్రంగా ట్రోల్ చేశారు. ఆ ఘటనను మరిచిపోకముందే మరోసారి సోషల్ మీడియా యూజర్స్‌కు అతడు లక్ష్యంగా మారాడు.
తాజాగా సబ్యసాచి వింటర్ కలెక్షన్-2021 పేరిట ఆభరణాలను లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా ఒక యాడ్‌ను రూపొందించాడు. ఆ యాడ్‌లో ముగ్గురు మోడల్స్ కనిపించారు. వారి ముఖంలో ఎటువంటి సంతోషం కూడా లేదు. దీంతో నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘‘ అంత్యక్రియలల్లో వాడే కలెక్షన్ ఇదే ’’ అని ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు. ‘‘విధవల్లాగా కనిపించాలని ఎవరానుకుంటారు ’’ అని మరో నెటిజన్ స్పందించాడు. ‘‘ ఎటువంటి మోడల్స్‌ను నువ్వు సెలెక్ట్ చేశావు’’ అని ఒక సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. ‘‘ మోడల్స్ ఎందుకు విచారంగా కనిపిస్తున్నారు ’’ అని ఒక నెటిజన్ తన స్పందనను తెలిపాడు.