సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aryan Khan డ్రగ్స్ కేసు నేపథ్యంలో నెట్టింట వైరల్ అవుతున్న Neeraj Chopra పాత వీడియో.. Shah Rukh Khan గురించి..

ABN, First Publish Date - 2021-10-06T21:14:31+05:30

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్యన్‌పై, షారూక్ పెంపకంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. పాత వీడియోలు తవ్వి తీస్తున్నారు. `నా కొడుకు తనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయవచ్చు. సిగరెట్లు కాల్చవచ్చు. అమ్మాయిలతో తిరగవచ్చు. డ్రగ్స్ తీసుకోవచ్చు` అంటూ షారూక్ గతంలో చెప్పిన వీడియో ఇటీవల వైరల్ అయింది. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఇటీవలి టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రా పాత వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో షారూక్‌ను తన ఇన్‌స్పిరేషన్‌గా చెప్పడానికి నీరజ్ నిరాకరించాడు. `మీ పొడవు జుట్టుకు స్ఫూర్తి ఎవరు? షారూక్ ఖాన్‌యేనా?` అని వ్యాఖ్యాత అడిగారు. దానికి నీరజ్ స్పందిస్తూ.. `కాదు.. నాకు పొడవు జుట్టంటే ఇష్టం అంతే` అని బదులిచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.  

Updated Date - 2021-10-06T21:14:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!