సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aryan Khan Drugs Case: ఎన్సీబీ టార్గెట్ లిస్ట్‌లో బడా ప్రముఖులు.. నిర్మాత కూతురు, ఓ హీరోయిన్ సోదరి సహా..

ABN, First Publish Date - 2021-10-22T21:13:02+05:30

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాట్ ఆధారంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందుకెళుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనన్యా పాండేను ఎన్‌సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. త్వరలో మరింత మందిని ఎన్‌సీబీ విచారించనుందట. ఆర్యన్ ఖాన్‌తో సన్నిహితంగా మెలిగే బాలీవుడ్ ప్రముఖులను విచారించనుందట. 


వీరిలో బాలీవుడ్ స్టార్ నిర్మాత కూతురు, ఓ ప్రముఖ హీరో మేనల్లుడు, స్టార్ హీరో కూతురు, స్టార్ హీరోయిన్ సోదరి ప్రస్తుతానికి ఎన్‌సీబీ అధికారుల జాబితాలో ఉన్నారట. వీరంతా ఆర్యన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారేనట. ఆర్యన్ వాట్సాప్ ఛాట్ ఆధారంగానే వీరిని ఎన్‌సీబీ అధికారులు కనుగొన్నారట. వీరిని త్వరలో విచారణకు పిలవనున్నారట. కాగా, వీరిలో ఇద్దరు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2021-10-22T21:13:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!