సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

న్యూయార్క్‌కు వెళ్లాను రాజును కాలేకపోయాను: నవాజుద్దీన్ సిద్దిఖీ

ABN, First Publish Date - 2021-11-29T01:41:14+05:30

విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నవాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఓటీటీలు పెద్ద దందాగా మారాయని బాలీవుడ్ నిర్మాతలను విమర్శించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నవాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఓటీటీలు పెద్ద దందాగా మారాయని బాలీవుడ్ నిర్మాతలను విమర్శించి అతడు వార్తల్లోకెక్కాడు. అనంతరం ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. అతడు తాజాగా నటించిన చిత్రం ‘‘సిరీయస్ మెన్’’. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయింది. ఆ సినిమాలోని పాత్రకు గాను అతడు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు నామినేషన్ సాధించాడు. కానీ, ఆ అవార్డు అతడికి దక్కలేదు. దీంతో అతడు తన అసంతృప్తిని కవితాత్మకంగా వర్ణించాడు. 


నవాజుద్దీన్ సిద్దిఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ‘‘ న్యూయార్క్‌కు  వెళ్లాను. కానీ, రాజును కాలేకపోయాను. భవిష్యత్తులోను అవార్డు కోసం ప్రయత్నిస్తాను’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ‘‘సూర్యడు తూర్పున ఉదయిస్తాడు. పడమరన అస్తమిస్తాడు. మీరు ఏమి చేయాలనుకున్న అదే చేయండి. పూర్తి శక్తిమేరకు ప్రయత్నించండి’’ అని మరో మెసేజ్‌ను కూడా అతడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. 



Updated Date - 2021-11-29T01:41:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!