సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కంగన నిర్మాణంలో నవాజుద్దీన్‌

ABN, First Publish Date - 2021-07-15T06:58:05+05:30

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కథానాయకుడిగా కథానాయిక కంగనా రనౌత్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ‘టీకూ వెడ్స్‌ షేరు’ టైటిల్‌ ఖరారు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కథానాయకుడిగా కథానాయిక కంగనా రనౌత్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ‘టీకూ వెడ్స్‌ షేరు’ టైటిల్‌ ఖరారు చేశారు. సాయి కబీర్‌ దర్శకత్వం వహించనున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్‌ పతాకంపై కంగనా రనౌత్‌ రూపొందిస్తున్న ఈ సినిమా ఓటీటీ కోసం సిద్ధం చేస్తున్నారట. ‘మణికర్ణిక’ చిత్రంతో కంగనా రనౌత్‌ దర్శకురాలిగా మారారు. క్రిష్‌ తెరకెక్కించిన సినిమాలో మార్పులు చేశారామె. తన నిర్మాణ సంస్థకు మణికర్ణిక ఫిల్మ్స్‌ అని నామకరణం చేశారు. నిర్మాతగా తొలి డిజిటల్‌ సినిమా టైటిల్‌ కూడా ఆమె హిట్‌ చిత్రాలు ‘తను వెడ్స్‌ మను’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ను గుర్తు చేసేలా ఉండటం గమనార్హం. నిజం చెప్పాలంటే... సాయి కబీర్‌తో తొలుత ఈ సినిమా చేయాలనుకోలేదు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బయోపిక్‌ ‘ఎమర్జెన్సీ’లో కంగనా రనౌత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకురాలు కూడా కంగనాయే. అయితే, తొలుత సాయి కబీర్‌ను దర్శకుడిగా అనుకున్నారు. సినిమా ప్రకటించినప్పుడు అతడే దర్శకుడని చెప్పారు. సెట్స్‌ మీదకు వెళ్లే సమయానికి ‘‘నేను దర్శకత్వం వహిస్తేనే చిత్రానికి న్యాయం జరుగుతుంది’’ అని కంగనా రనౌత్‌ మెగాఫోన్‌ పట్టారు. ఇప్పుడు సాయి కబీర్‌ చేతిలో ‘టీకూ వెడ్స్‌ షేరూ’ దర్శకత్వ బాధ్యతలు పెట్టారు. 


Updated Date - 2021-07-15T06:58:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!