సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

14 రోజుల జుడీషియల్ కస్టడీ...

ABN, First Publish Date - 2021-10-08T01:23:33+05:30

బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరో 14 రోజులు జుడీషియల్ కస్టడీలో ఉండనున్నాడు. అతడితో పాటూ మరో ఏడుగురు నిందితుల్ని కూడా జుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు అదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరో 14 రోజులు జుడీషియల్ కస్టడీలో ఉండనున్నాడు. అతడితో పాటూ మరో ఏడుగురు నిందితుల్ని కూడా జుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు అదేశించింది. తమ కస్టడీకి అనుమతించాలని ఎన్సీబీ చేసిన అభ్యర్థనని కోర్టు తోసిపుచ్చింది. ఎన్సీబీ రిమాండ్ రిపోర్ట్ స్పష్టంగా లేని కారణంగా డ్రగ్స్ కేసు నిందితులు అందర్నీ జడ్జ్ జుడీషియల్ కస్టడీకి తరలించాలంటూ అదేశించారు. 


మరోవైపు, షారుఖ్ తనయుడి తరుఫున వాదిస్తోన్న లాయర్ ఇప్పటికే మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. గత రెండు రోజులుగా ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనవసరంగా తన క్లైంట్‌ను అదుపులో ఉంచుకోటానికి వీల్లేదంటూ ఆయన బలంగా తన వాదన వినిపించారు. ఆర్యన్ బెయిల్ పీటీషన్‌పై విచారణ శుక్రవారం ఉదయం కొనసాగనుంది.   

Updated Date - 2021-10-08T01:23:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!