మిస్ యూనివర్స్‌కి ఆ బ్యూటీ బయోపిక్‌లో నటించాలని ఉందంటా..
ABN , First Publish Date - 2021-12-28T17:56:57+05:30 IST
దాదాపు 21 ఏళ్ల తర్వాత దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చిన బ్యూటీ హర్నాజ్ సంధు. 2000లో లారాదత్తా చివరిసారిగా ఈ గౌరవాన్ని పొందింది...

దాదాపు 21 ఏళ్ల తర్వాత భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చిన బ్యూటీ హర్నాజ్ సంధు. 2000లో లారాదత్తా చివరిసారిగా ఈ గౌరవాన్ని పొందింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బయోపిక్‌లో నటించాలని ఉన్నట్లు తెలిపింది.
ఆ ఇంటర్య్వూలో మీకు ఏ సెలబ్రిటీ బయోపిక్‌లో నటించాలనుంది అని యాంకర్ అడగగా.. ‘ఖచ్చితంగా ప్రియాంక చోప్రా. ఆమె జీవితం, ఆమె సినీ ప్రయాణం నాతో పాటు చాలామందికి ఇన్‌స్పిరేషన్. అందుకే ఆమె జీవిత ప్రయాణంపై వచ్చే సినిమాలో భాగమవ్వాలని ఉంద’ని చెప్పింది.
అంతేకాకుండా ఇటీవల ఓ వీడియోలో సైతం.. ‘నాకు ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఆమె నుంచి ఎనో పాఠాలు నేర్చుకున్నాను. అందుకే ఎప్పుడూ ఆమెనే ఎంపిక చేసుకుంటాన’ని చెప్పుకొచ్చింది.
