హర్నాజ్ అందాల కిరీటంలో... ఎన్ని వందల వజ్రాలో తెలుసా?

ABN , First Publish Date - 2021-12-14T23:04:13+05:30 IST

భారతదేశానికి చెందిన 21 ఏళ్ల హర్నాజ్ సందూ ఇజ్రాయిల్‌లో మిస్ యూనివర్స్ 2021 కిరీటం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. అయితే, ఆమెకు అలంకరించిన అందాల మకుటంలో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా?

హర్నాజ్ అందాల కిరీటంలో... ఎన్ని వందల వజ్రాలో తెలుసా?

భారతదేశానికి చెందిన 21 ఏళ్ల హర్నాజ్ సందూ ఇజ్రాయిల్‌లో మిస్ యూనివర్స్ 2021 కిరీటం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. అయితే, ఆమెకు అలంకరించిన అందాల మకుటంలో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా? 1725 వైట్ డైమండ్స్! అంతే కాదు, మూడు బంగారు రంగు భారీ వజ్రాలు కూడా పొదిగారు!


‘‘మిస్ యూనివర్స్ తలపై అలంకరించే కిరీటంలో మధ్య భాగంలో ఉంటుంది... ‘మాడిఫైడ్ మిక్స్డ్ కట్ గోల్డెన్ క్యానరీ డైమండ్’. దాని బరువు 62.83 క్యారెట్లు. మకుటం మధ్యలో వెలిగిపోయే ఆ వజ్రం ‘స్త్రీలోని ఆంతరంగిక శక్తి’కి నిదర్శనం. అంతే కాదు, స్వర్ణ వర్ణంతో మెరిసిపోయే అదే వజ్రం... ఐకమత్యంలోనే శక్తి దాగుంటుందని మనకు గుర్తు చేస్తుంటుంది!’’ అన్నాడు మిస్ యూనివర్స్ కిరీటం తయారు చేసిన మౌవాద్. ప్రపంచ ప్రఖ్యాత విశ్వ సుందరి మకుటం మన హర్నాజ్ సందూ తలపై సంవత్సరం పాటూ ధగధగలాడనుంది... 

Updated Date - 2021-12-14T23:04:13+05:30 IST